మహారాణిపేట: తుపాను హెచ్చరికల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. 19, 20 తేదీల్లో భారీ వర్షాలు, పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున పల్లపు ప్రాంతాలు, కొండవాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదన్నారు. అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు తమ పరిధిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని ఆదేశించారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
బంగాళాఖాతంలో ఆక్వాన్ తీవ్ర తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగా కలెక్టరేట్‌లో 24/7 పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏమైనా సమాచారం ఉంటే ఈ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని అధికారులు కోరారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు:
8912590100, 8912590102


