గురుకుల విద్యా సంస్థల్లో బాలల వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

గురుకుల విద్యా సంస్థల్లో బాలల వారోత్సవాలు

Nov 16 2026 12:32 AM | Updated on Nov 16 2026 12:32 AM

కంచరపాలెం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో బాలల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మేహాద్రి గెడ్డ అంబేడ్కర్‌ గురుకులంలో చైల్డ్‌ న్యూట్రీ గార్డెన్‌ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ విశాఖ జిల్లా సమన్వయాధికారి ఎస్‌.రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, విద్యార్థులతో కలిసి గురుకుల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ, స్పృహతోపాటు పోషకాహారం ప్రాముఖ్యతను పెంపొందించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని రామకృష్ణ తెలిపారు. ప్రతి విద్యార్థి మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల, జిల్లా స్థాయి అధికారులు, గురుకుల విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement