రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌లో
11 పతకాలు కై వసం
మురళీనగర్: ఈ నెల 14, 15 తేదీల్లో నెల్లూరులో నిర్వహించిన 46వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో విశాఖ జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభతో సత్తా చాటారు. ఎల్వీ సుధాకర్ 45+ విభాగంలో మూడు బంగారు, 100 మీటర్ల పరుగు పందెంలో కాంస్య, 5 కిలోమీటర్ల నడక పోటీలో కాంస్య, 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం కై వసం చేసుకున్నారు. సనపల జయకృష్ణ (40+ విభాగం) 1500 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం, 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం, అమరరాణి (40+ విభాగం) 100 మీటర్ల పరుగు పందెం, 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకాలు, లాంగ్ జంప్‌లో రజత పతకం సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా విజేతలను పలువురు క్రీడాభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు.


