నాగుల చవితి సందడి | - | Sakshi
Sakshi News home page

నాగుల చవితి సందడి

Nov 14 2026 1:41 AM | Updated on Nov 14 2026 1:41 AM

పర్యాటక ప్రాంతాలు కళకళ!

ఆరిలోవ: నాగుల చవితి పర్వదినం.. కార్తీక మాసపు సందడి.. వెరసి నగరంలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడాయి. జూ పార్కు, కంబాలకొండ ఎకోటూరిజం పార్కుల్లో సహజసిద్ధమైన పుట్టలు ఉండటంతో నగరంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పుట్టల వద్ద నాగన్నకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చినవారు చెట్ల నీడన, విశ్రాంతి షెడ్లు, రచ్చబండల వద్ద సహపంక్తి భోజనాలు చేశారు. కంబాలకొండలోని ఆట పరికరాల వద్ద చిన్నారులు సందడి చేశారు. బోటింగ్‌ కొలనులో నీరు సమృద్ధిగా ఉండటంతో సందర్శకులు బోట్లలో విహరించారు. జూ పార్కులో ఏనుగులు, నీటి ఏనుగులు, పులులు, కోతులు, చుక్కల జింకలు, జిరాఫీలు, జీబ్రాలు, నెమళ్లు, లవ్‌ బర్డ్స్‌, ఆస్ట్రిచ్‌లను తిలకిస్తూ పిల్లలు ఉత్సాహంగా గడిపారు.

జూకు తగ్గిన సందర్శకులు

జూ పార్కు ప్రవేశ రుసుం పెంపు సందర్శకుల సంఖ్యపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. గతేడాది నాగుల చవితితో పోలిస్తే ఈసారి 1,796 మంది తగ్గారు. గత ఏడాది 9,664 మంది జూను సందర్శించగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 7,868కే పరిమితమైంది. ఇటీవల ప్రవేశ రుసుంను పెద్దలకు రూ.70 నుంచి రూ.100కు, కారుకు రూ.700 నుంచి రూ.1,000కు పెంచారు. పెరిగిన ధరలు సందర్శకులకు భారంగా మారడంతో సందర్శకుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. శుక్రవారం సందర్శకుల ద్వారా జూ పార్కుకు రూ.8,55,600 ఆదాయం సమకూరినట్లు క్యూరేటర్‌ జి.మంగమ్మ తెలిపారు.

కంబాలకొండకు పెరిగిన సందర్శకులు

కంబాలకొండ ఎకోటూరిజం పార్కుకు ఈ ఏడాది సందర్శకుల తాకిడి పెరిగింది. నాగుల చవితి సందర్భంగా సుమారు 5 వేల మందికి పైగా పార్కును సందర్శించారు. వీరి ద్వారా రూ.3,29,000 ఆదాయం సమకూరినట్లు ఇన్‌చార్జి శివప్రసాద్‌ తెలిపారు. గత ఏడాది సుమారు 4 వేల మంది సందర్శించగా రూ.2,67,840 ఆదాయం వచ్చింది. ఈసారి అదనంగా సుమారు వెయ్యి మంది రావడంతో ఆదాయం రూ.60 వేలకు పైగా పెరిగింది.

ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో.. ట్రైనింగ్‌ సెంటర్‌లో...

కంబాలకొండ లోపల ఆటపరికరాలు వద్ద పిల్లల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement