విశాఖ పరిశుభ్రత, సుందరీకరణపై సీఎం ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

విశాఖ పరిశుభ్రత, సుందరీకరణపై సీఎం ప్రశంసలు

Nov 14 2026 1:41 AM | Updated on Nov 14 2026 1:41 AM

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌కు

ప్రత్యేక పురస్కారం

అల్లిపురం: స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025–26లో జాతీయ స్థాయిలో తొలిసారిగా ప్రథమ స్థానం సాధించిన విశాఖ నగరాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడంలో జీవీఎంసీ యంత్రాంగం చేసిన కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌కు ప్రత్యేక ప్రశంసా పురస్కారాన్ని అందించారు. విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ విజయవంతానికి కృషిచేసిన 252 మంది అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులను సీఎం సత్కరించి, అవార్డులు అందజేశారు. విశాఖను దేశానికే కాకుండా ప్రపంచానికి పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నగర అభివృద్ధికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, నగర ప్రజలు, పారిశుధ్య కార్మికులకు కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement