విశాఖ విద్య: దువ్వాడ రామాలయం పక్కన న్యాయస్థానం పరిధిలో ఉన్న స్థలంలో గురువారం అక్రమంగా ప్రవేశించి నట్టి అప్పలరాజు అనే వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో 96వ వార్డు టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో పాటు ఆయన కుటుంబీకులు గంధం కామేష్, గంధం సత్యనారాయణ, గంధం పైడిరాజులపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నమ్మి గణేష్ తెలిపారు. ఈ కేసుపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలిగా చెబుతున్న వెంకటలక్ష్మిపై గంధం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసు నమోదుచేశారు.


