సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకున్న వారిలో రిపబ్లిక్ ఆఫ్ మారిషస్ వాణిజ్య, వినియోగదారుల వ్యవహారాలశాఖ శాశ్వత కార్యదర్శి దేవరాని మాథుర్ మనోరమ, ఫిజీ దేశ సహాయ మంత్రి షాలేన్ కుమార్, ఎంసీసీ గ్రూప్ ఆఫ్ బిజినెస్ వ్యవస్థాపకుడు, ఎండీ మారుతి గాజుల, హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్టు అధికారి మాధవ్ ఆర్.సుల్ఫులే, విదేశాంగ వ్యవహారాల శాఖ అధికారి గణేష్‌రెడ్డి, రొమేనియా దేశానికి చెందిన అంతర్జాతీయ వక్త దిను నోలాయ్ జార్జ్, ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ మోహన్ ఎల్లిశెట్టి, సుమితోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారి సత్య రామమూర్తి తదితరులు ఉన్నారు. అంతరాలయంలో వీరి పేరిట అర్చకులు అష్టోత్తరపూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందించారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రంలను దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు అందజేశారు.


