నరెడ్కో ప్రోపర్టీ ఎక్స్‌పోలో మంత్రులు, అధికారులు | - | Sakshi
Sakshi News home page

నరెడ్కో ప్రోపర్టీ ఎక్స్‌పోలో మంత్రులు, అధికారులు

Nov 14 2026 1:41 AM | Updated on Nov 14 2026 1:41 AM

ఎంవీపీ కాలనీ: నగరంలోని గాదిరాజు ప్యాలెస్‌ వేదికగా నరెడ్కో ఆధ్వర్యంలో వైజాగ్‌ ప్రోపర్టీ ఎక్స్‌పో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవంలో వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ఎం.వి.ప్రణవ్‌గోపాల్‌, మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ పాల్గొన్నారు. విశాఖలోని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలన్నీ ఒకే తాటి పైకి వచ్చి ఇక్కడ ఈ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. విశాఖ అభివృద్ధిలో అన్నివిధాలా భాగస్వాములవుతున్న నరెడ్కో ప్రతినిధులను అభినందించారు. అనంతరం విశాఖ ఇన్‌చార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయులు, రాష్ట్ర పట్టణ పురపాలక శాఖమంత్రి పి.నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, రాష్ట్ర పట్టణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ తదితరులు సందర్శించారు. ప్రధానంగా వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. రానున్న రోజుల్లో విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందని, అందుకు తగిన సదుపాయాలు, వాతావరణం కల్పించన్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నరేడ్కో ప్రతినిధులు సురేష్‌, చక్రధర్‌, వెంకన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement