విశాఖ విద్య: దువ్వాడ నుంచి గోపాలపట్నం రైల్వే స్టేషన్ల మధ్య కొత్తపాలెం బ్రిడ్జి సమీపంలోని డౌన్ లైన్ రైల్వే ట్రాక్‌పై సుమారు 45–50 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వివాహిత మృతదేహాన్ని రైల్వే పోలీసులు శుక్రవారం గుర్తించారు. రైల్వే జీఆర్పీ ఎస్ఐ కేటీఆర్ లక్ష్మి తెలిపిన వివరాలు.. మృతురాలు చామన ఛాయ కలిగి, డార్క్ బ్లూ కలర్ చీర, పింక్ కలర్ జాకెట్, మంగళసూత్రం చైన్, కాళ్లకు పట్టీలు, మెట్టెలు, చెవులకు రింగులు ఉన్నట్లు తెలిపారు. తల తెగి ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని, మరణానికి కారణం, మృతురాలిని గుర్తించే ఆధారాలు తెలియరాలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు. వివరాలు తెలిసిన వారు 7382058996 సెల్ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.


