గల్లంతైన విద్యార్థిని మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన విద్యార్థిని మృతదేహం లభ్యం

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

పెదగంట్యాడ: విశాఖ నగరంలోని గోకుల్‌ పార్కు వద్ద గల బీచ్‌లో ఈ నెల 7న గల్లంతైన పదో తరగతి విద్యార్థిని కరణం వెంకటి మృతదేహం పాత గంగవరం తీరంలో ఆదివారం అర్ధరాత్రి లభ్యమైంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలు.. పరవాడ మండలం, దేశపాత్రునిపాలేనికి చెందిన కరణం అమ్మాజీ తన ఇద్దరు కుమార్తెలు కరణం పూలలక్ష్మి, వెంకటి(15)తో కలసి నివాసం ఉంటోంది. పెద్ద కుమార్తె గాజువాకలోని ఓ దుస్తుల దుకాణంలో పని చేస్తుండగా, చిన్న కుమార్తె పదో తరగతి చదువుతోంది. ఈ నెల 6న ఇద్దరూ కలసి ఆర్కేబీచ్‌కు వెళ్లారు. ఆరోజు రాత్రి వారు ఇంటికి రాలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం సమయంలో పూలలక్ష్మి తన తల్లి అమ్మాజీకి ఫోన్‌ చేసిన చెల్లి వెంకటి సముద్రంలో గల్లంతైందని సమాచారం ఇచ్చింది. మహారాణి పేట పోలీసులకూ ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు గల్లంతైన వెంకటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆదివారం అర్ధరాత్రి దాటాక పాత గంగవరం తీరానికి మృతదేహం కొట్టుకువచ్చింది. సమాచారం అందుకున్న న్యూపోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement