పన్నెండేళ్ల నిరీక్షణకు ఫలితం.. కొవ్వొత్తుల చెట్టుకు కాపు | - | Sakshi
Sakshi News home page

పన్నెండేళ్ల నిరీక్షణకు ఫలితం.. కొవ్వొత్తుల చెట్టుకు కాపు

Nov 8 2026 12:37 AM | Updated on Nov 8 2026 12:37 AM

బీచ్‌రోడ్డు(విశాఖ): నగరంలోని డీఎన్‌సీఎస్‌ జీవ వైవిధ్య ఉద్యానవనంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు పన్నెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ అరుదైన కొవ్వొత్తి చెట్టు తొలిసారిగా కాపు కాసింది. చెట్టు నిండా కొవ్వొత్తుల ఆకారంలో వేలాడుతున్న పసుపు రంగు పండ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.సాయంత్రం వేళల్లో ఈ పండ్లు సహజంగా వెలిగే దీపాల్లా కనిపిస్తూ ఉద్యానవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అరుదైన ఈ వృక్షాన్ని చూసేందుకు వృక్ష ప్రేమికులు, విద్యార్థులు, నగరవాసులు తరలివస్తున్నారు.

చెట్టు మొదలు నుంచే పూలు, పండ్లు

ఈ చెట్టు అసలు పేరు కొవ్వొత్తి చెట్టు (పార్మెంటీరా సెరిఫెరా). బిగ్నోనియేసి కుటుంబానికి చెందిన ఈ అలంకార వృక్షం స్వస్థలం పనామా దేశం. ఏడాది పొడవునా పచ్చగా ఉండే ఈ చెట్టు ఆకులు మూడు కలసి ఒకే కాడకు ఏర్పడతాయి.ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణంగా కొమ్మల చివర వచ్చే పూలు, పండ్లు దీనికి మాత్రం చెట్టు మొదలు నుంచే ఏర్పడతాయి. ఆకుపచ్చ, తెలుపు రంగుల మేళవింపుతో గంట ఆకారంలో పూలు పూస్తాయి. అనంతరం పొడవైన స్తంభాల్లాంటి పండ్లు ఏర్పడి, వాటిపై ఉండే మైనపు పూతతో పసుపు రంగులో కొవ్వొత్తుల్లా మెరుస్తాయి. ఈ పండ్లను తినవచ్చని, ఆకులు, వేర్లలో ఔషధ గుణాలు ఉన్నట్లు వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒక్కసారి కనిపించిన ఈ ప్రకృతి అద్భుతం ప్రస్తుతం డీఎన్‌సీఎస్‌ ఉద్యానవనానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement