శ్రీ చైతన్య విద్యా సంస్థలో రక్తదాన శిబిరం | - | Sakshi
Sakshi News home page

శ్రీ చైతన్య విద్యా సంస్థలో రక్తదాన శిబిరం

Nov 7 2026 1:30 AM | Updated on Nov 7 2026 1:30 AM

మహారాణిపేట: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్‌పర్సన్‌ డాక్టర్‌ బి.ఝాన్సీ లక్ష్మీబాయి 79వ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలు, పాఠశాలల్లో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ద్వారకానగర్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో శ్రీ చైతన్య కాలేజీల ఎగ్జిక్యూటివ్‌ ఏజీఎం కె.వి.రమణ, శ్రీ చైతన్య స్కూల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఏజీఎం ఎం.వి.సురేష్‌ పాల్గొని రక్తదానం చేసిన సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా కె.వి.రమణ మాట్లాడుతూ సరైన సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్న ఎంతోమందికి ప్రాణదానం చేసేందుకు సిబ్బంది రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం ఒక్కసారైనా రక్తదానం చేయాలని ఎం.వి.సురేష్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డీన్లు, ఏజీఎంలు, ఆర్‌ఐలు, ప్రిన్సిపాళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏటీఆర్‌ బ్లడ్‌ బ్యాంకుల సహకారంతో మొత్తం 360 మంది రక్తదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement