మహారాణిపేట: పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచి, 8 గంటలకు లెక్కింపు ప్రారంభించాలని సూచించారు. అనధికార వ్యక్తులను అనుమతించవద్దని, సమస్యలు తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఫలితాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.


