సింథియా : భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ రాజ్‌భవన్‌లో శనివారం నిర్వహించే సత్కారానికి శ్రీహరిపురానికి చెందిన సీనియర్ స్కౌట్ ఎస్.వి.రమణ (75) ఎంపికయ్యారు. హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఉద్యోగిగా పనిచేస్తూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో సేవలందించిన ఆయన.. ప్రపంచ తెలుగు మహాసభలు, గోదావరి పుష్కరాలు, లాతూర్ భూకంప సహాయక చర్యలు, పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోవర్ స్కౌట్స్‌కు శిక్షణ అందించి రాష్ట్రపతి అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించారు. రమణ ఎంపికపై షిప్‌యార్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.


