తాటిచెట్లపాలెం : దొండపర్తిలోని పద్మపూజిత వీల్స్ మార్ట్ కార్యాలయంలో దసరా సందర్భంగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత ఆర్‌ఎస్‌వీపీ బసవరాజు మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా పద్మపూజిత వీల్స్ మార్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు బ్రాంచ్‌ల ద్వారా వినియోగదారులకు సేవలందిస్తోందని తెలిపారు. దసరా సందర్భంగా సుమారు 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం వినియోగదారులకు లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది సుమారు రూ.75 లక్షల విలువైన బహుమతులను లక్కీ డ్రా ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ బ్రాంచ్‌లకు చెందిన సుమారు 100 మంది వినియోగదారులకు 50 రైస్ కుక్కర్లు, 25 స్మార్ట్‌ఫోన్లు, 25 రిఫ్రిజిరేటర్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.సంస్థ అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిన ఆదరణ, సిబ్బంది చేసిన కృషి మరువలేనిదన్నారు. పద్మపూజిత చారిటబుల్ సంస్థ ద్వారా లాభాల్లో కొంత భాగంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని బ్రాంచ్‌ల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతామని చెప్పారు.కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సాయిబాబు, మహేష్, రమేష్, ఫన్నీ, రహీం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


