డాబాగార్డెన్స్: జగదాంబ జంక్షన్‌లో నగర సుందరీకరణలో భాగంగా నిర్మించిన ఐకానిక్ క్లాక్‌టవర్ గడియారం పక్షం రోజులుగా పనిచేయడం లేదు. బ్రిటిష్ కాలం నాటి వింటేజ్ యూరోపియన్ శైలిలో నిర్మించిన ఈ టవర్ రాత్రివేళ విద్యుత్ కాంతులతో ఆకట్టుకుంటోంది. పర్యాటకులకు ఫొటోషూట్ స్పాట్‌గా నిలిచిన క్లాక్‌టవర్‌లో గడియారం తప్పు సమయాలను చూపుతోంది. తూర్పు వైపు 2.35 గంటలు, పడమర వైపు 6.40 గంటలు చూపిస్తుండటంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
పడమర వైపున 6.40 సమయం చూపుతున్న
దృశ్యం
సాయంత్రం 4 గంట లకు తూర్పు వైపున 2.35 చూపుతున్న గడియారం


