అల్లిపురం: ఏపీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో నవంబర్ 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ వీక్ (బీఎస్‌ఎల్‌డబ్ల్యూ–2026)లో భాగంగా జిల్లాలోని ఏడు డిపోల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. యోగా, మొక్కలు నాటడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు ద్వారకా బస్ స్టేషన్, సింహాచలం, మద్దిలపాలెం బస్ స్టేషన్లను తనిఖీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, క్లాత్ సంచులను వినియోగించాలని స్టాల్ నిర్వాహకులు, సిబ్బందికి సూచించారు.ఉద్యోగులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


