జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

మహారాణిపేట: జిల్లాలోని భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి మండలాల పరిధిలో గురువారం నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకతతో పోలింగ్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement