టీడీపీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న
మహ్మద్‌సాధిక్ (జనసేన), 39వ వార్డు
అభ్యర్థి దామోదర్ యాదవ్ (బీజేపీ)
డాబాగార్డెన్స్ : విశాఖ కూటమిలో విభేదాలు బహిర్గతమయ్యాయి. టీడీపీ దక్షిణ ఇన్‌చార్జ్ సీతంరాజు సుధాకర్‌పై జనసేన, బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు అన్యాయం చేశారంటూ ఆయనను పార్టీ నుంచి, కూటమి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇటీవల జరిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రెండో సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన 36వ వార్డు జనసేన అభ్యర్థి మహ్మద్ సాధిక్, 39వ వార్డు బీజేపీ అభ్యర్థి దామోదర్ యాదవ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్ యాదవ్ మాట్లాడుతూ.. తాను బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా 39వ వార్డు నుంచి పోటీ చేశానన్నారు. కూటమి పెద్దలతో చర్చించిన అనంతరం దక్షిణ జోన్‌లో బీజేపీకి కేటాయించిన ఏకై క సీటు తనకు ఇచ్చారని తెలిపారు. అయితే టీడీపీ సౌత్ ఇన్‌చార్జ్ సీతంరాజు సుధాకర్ తనకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టి, ఆయనకు సహకరించారని ఆరోపించారు. కూటమి అభ్యర్థికి సహకరించాల్సిన సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయానికి ప్రయత్నించడం ద్వారా కూటమిలో విభేదాలు సృష్టించారని విమర్శించారు. బీజేపీని కానీ, ఆ పార్టీ అభ్యర్థులను కానీ అవమానిస్తే సహించేది లేదని, సీతంరాజు సుధాకర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 36వ వార్డు జనసేన అభ్యర్థి మహ్మద్ సాధిక్ మాట్లాడుతూ.. గతంలో కార్పొరేటర్‌గా ఐదేళ్లు సేవలందించానని, ఈసారి మహిళా రిజర్వేషన్ కారణంగా తన సతీమణిని బరిలో నిలిపానన్నారు. తన అనుచరులకు టికెట్లు రాలేదనే కారణంతో సీతంరాజు సుధాకర్ ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించి కూటమి అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు.టీడీపీ పోటీ చేసిన వార్డుల్లో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సహకరించారని, కానీ జనసేన, బీజేపీ పోటీ చేసిన వార్డుల్లో ఇండిపెండెంట్లకు సహకరించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. దీనిపై కూటమి నాయకత్వం స్పందించాలని కోరారు.


