సంపత్‌ వినాయగర్‌ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

సంపత్‌ వినాయగర్‌ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

మహారాణిపేట: ఆశీలమెట్టలోని శ్రీ సంపత్‌ వినాయగర్‌ ఆలయ హుండీలను గురువారం తెరిచి లెక్కించారు. దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ అన్నపూర్ణ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రాజేశ్వరన్‌ చోళన్‌ సమక్షంలో శివ జ్యోతి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సేవా సభ్యులు, ఆలయ సిబ్బంది హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 24 రోజులకు గాను హుండీ లెక్కింపు ద్వారా రూ.16,82,715 , 10 గ్రాముల వెండి, 42 అమెరికన్‌ డాలర్లు ఆదాయంగా లభించినట్లు ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు. ఈ మొత్తాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సూర్యబాగ్‌ శాఖ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement