ఆంక్షల నీడలో ప్రాదేశిక పోరు | - | Sakshi
Sakshi News home page

ఆంక్షల నీడలో ప్రాదేశిక పోరు

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

ఆనందపురంలో మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న ప్రజలు

సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల ఏకపక్ష వైఖరి మధ్య విశాఖ రూరల్‌ పరిధిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ముగిసింది. ఇటీవల జరిగిన మున్సిపల్‌, జీవీఎంసీ ఎన్నికల తరహాలోనే పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కూటమి ప్రజాప్రతినిధులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, పక్షపాత వైఖరి ప్రదర్శించారనే ఆరోపణలు వినిపించాయి. అధికారులు వెల్లడించిన ప్రాథమిక సమాచారం ప్రకారం విశాఖ రూరల్‌ పరిధిలోని భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి మండలాల్లో సాయంత్రం పోలింగ్‌ ముగిసే సమయానికి సగటున 82.51 శాతం ఓటింగ్‌ నమోదైంది. 2021లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఈ నాలుగు మండలాల్లో సగటున 87.5 శాతం పోలింగ్‌ నమోదవగా, ఈసారి 6.3 శాతం తగ్గడం గమనార్హం. మొత్తం నాలుగు జెడ్పీటీసీ, 52 ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 203 పోలింగ్‌ కేంద్రాల్లో 1,34,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బరిలో ఉన్న 13 మంది జెడ్పీటీసీ, 117 మంది ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ పోలింగ్‌ శాతం తగ్గడం చర్చనీయాంశంగా మారింది.

మహిళా ఓటర్లదే ఆధిక్యం

ప్రతి ఎన్నికల్లోనూ ఉత్సాహంగా పాల్గొనే మహిళా ఓటర్లు ఈసారి కూడా తమ భాగస్వామ్యాన్ని చాటుకున్నారు. పురుషుల కంటే అధిక సంఖ్యలో ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో కనిపించారు. ప్రతి రెండు గంటలకోసారి నమోదైన పోలింగ్‌ సరళిని పరిశీలించినా మహిళా ఓటర్ల భాగస్వామ్యమే అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 14.83 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 11 గంటలకు 20.57 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 56.33 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 71.23 శాతం ఓటింగ్‌ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసే సమయానికి మొత్తం 82.51 శాతం పోలింగ్‌ నమోదైంది.

బ్యాలెట్‌ బాక్సులు

స్ట్రాంగ్‌ రూంలకు తరలింపు

జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు.ఆనందపురం మండలానికి సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. భీమిలి, పద్మనాభం మండలాలకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను సీడర్‌ స్కూల్‌లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. పెందుర్తి మండలానికి చెందిన బ్యాలెట్‌ బాక్సులను పెందుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు.

గత ఎన్నికలకు..ప్రస్తుత ఎన్నికలకు

మధ్య వ్యత్యాసం

మండలం 2021 2026

ఎన్నికల్లో ఎన్నికల్లో

(శాతం) (శాతం)

ఆనందపురం 88.8 84.76

పద్మనాభం 86.5 81.89

భీమునిపట్నం 84.2 80.97

పెందుర్తి 90.69 81.40

పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసుల్లో మారని తీరు

ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌ 82.51 శాతం

గతంతో పోలిస్తే తగ్గిన పోలింగ్‌ శాతం

203 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఓటు వేసిన 1,34,000 మంది ఓటర్లు

జిల్లాలో 4 జెడ్పీటీసీ స్థానాలకు పోటీలో 13 మంది అభ్యర్థులు

53 ఎంపీటీసీ స్థానాలకు 117 మంది అభ్యర్థులు

పోలింగ్‌ ఎలా సాగిందంటే..

సమయం పోలింగ్‌ ఓటు మహిళలు పురుషులు శాతం వేసినవారు

ఉదయం 9 గం.కు 14.83 24,083 10,759 13,324

ఉదయం 11 గం.కు 20.57 33,415 17,910 15,505

మధ్యాహ్నం 1గం.కు 56.33 91,486 48,942 42,544

మధ్యాహ్నం 3గం.కు 71.23 1,15,683 61,396 54,287

5 గంటల వరకు 82.51 1,34,000 69,076 64,924

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement