కీటకం కాటుతో వ్యక్తి మృతి! | - | Sakshi
Sakshi News home page

కీటకం కాటుతో వ్యక్తి మృతి!

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

సింథియా/మల్కాపురం: గుర్తుతెలియని కీటకం కుట్టడంతో అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 76వ వార్డు జై ఆంధ్ర కాలనీకి చెందిన రేకపల్లి బాబూరావు (52) బుధవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఉండగా గుర్తుతెలియని కీటకం కుట్టింది. దీంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకోవడంతో బంధువులు సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలు వెల్లడవుతాయని తెలిపారు. కాగా, బాబూరావును విషసర్పం కరిచి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇదే ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఓ మహిళను కూడా పాము కాటేసిన ఘటన చోటుచేసుకోవడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి అసలు కారణం స్పష్టమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement