పెందుర్తి: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెందుర్తి పాతూరులో గురువారం చోటుచేసుకుంది.పాతూరు రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న మామిడి వెంకటేశ్ (35) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వెంకటేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడికి భార్య వనిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


