తుపాను వ్యర్థాలు తక్షణమే తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

తుపాను వ్యర్థాలు తక్షణమే తొలగించాలి

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

డాబాగార్డెన్స్‌: నగర రహదారులు, బీచ్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, తుపాను కారణంగా పేరుకుపోయిన వ్యర్థాలను తక్షణమే తొలగించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం తూర్పు జోన్‌ పరిధిలోని సిరిపురం జంక్షన్‌, బాలాజీనగర్‌, బీచ్‌రోడ్డులో పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ నుంచి ఆర్కే బీచ్‌ వరకు ఆయన తూర్పు జోన్‌ జోనల్‌ కమిషనర్‌ కె.శివప్రసాద్‌, సహాయక వైద్యాధికారి బి.ప్రసాదరావుతో కలిసి పర్యటించారు. సిరిపురం జంక్షన్‌, బాలాజీనగర్‌ ప్రాంతాల్లో తుపాను వ్యర్థాలు పూర్తిస్థాయిలో తొలగించకపోవడం, అలాగే బీచ్‌ పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లోనూ పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు, కార్యదర్శులను ఆదేశించారు. త్వరలో విశాఖలో సీఐఐ సమ్మిట్‌ జరగనున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు నగరాన్ని సందర్శించనున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రతిష్టకు తగినట్లుగా రహదారులు, బీచ్‌రోడ్డు, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement