దివ్యాంగుల సంక్షేమానికి ‘సీఎంఆర్‌’ ఆర్థిక సహాయం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సంక్షేమానికి ‘సీఎంఆర్‌’ ఆర్థిక సహాయం

Nov 6 2026 2:14 AM | Updated on Nov 6 2026 2:14 AM

మద్దిలపాలెం: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సిఎంఆర్‌ సంస్థ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు సీఎంఆర్‌ సంస్థ తరఫున మావూరి వెంకటరమణ రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.2007 సంవత్సరం నుంచి ప్రతి ఏటా దీపావళి సందర్భంగా ఈ సంస్థకు సిఎంఆర్‌ తన వంతు సహకారాన్ని అందిస్తోంది. అసోసియేషన్‌ సభ్యులు స్వయంగా తయారు చేసే దీపావళి ప్రమిదల కొనుగోలుకు రూ.25 వేలు, వారి జీవనోపాధికి తోడ్పాటుగా మరో రూ.25 వేలు చొప్పున మొత్తం రూ.50 వేల విరాళాన్ని అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.ఈ ఏడాది అందించిన ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్‌ సంస్థ ప్రతినిధుల తరఫున శ్రీమతి మావూరి వెంకట పద్మావతి స్వయంగా అసోసియేషన్‌ ప్రతినిధులకు అందజేశారు.దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతి దీపావళికి ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ దివ్యాంగుల స్వావలంబనకు, జీవనోపాధికి సిఎంఆర్‌ సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. పండుగ వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో నిండాలనే ఆశయంతో కొనసాగిస్తున్న ఈ సేవా కార్యక్రమం సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement