డాబాగార్డెన్స్: దేశ ప్రగతిలో జర్నలిస్టుల సేవలు నిరుపమానమని ప్రముఖ సంఘ సేవకులు మట్టపల్లి హనుమంతరావు, డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్ కొనియాడారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజాభివృద్ధిలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం పాతనగరంలోని స్వామి వివేకానంద అనాథ వృద్ధాశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని అనాథలకు, వృద్ధులకు అన్నదానం, వస్త్రదానం చేయడంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ మాట్లాడుతూ భవిష్యత్‌లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్‌తో పాటు ఇతర సంక్షేమ సదుపాయాలు కల్పించేందుకు మరింత అంకితభావంతో కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ధవలేశ్వరపు రవికుమార్, కృష్ణమూర్తినాయుడు, నగేష్, రవిశంకర్, ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్, జగన్మోహన్, కేవీ శర్మ, బొబ్బర ప్రసాద్, జగన్, గణేష్‌రెడ్డి, ప్రసాద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


