డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన పట్టణ ప్రణాళికా అధికారి(సీసీపీ)గా జీవీజీఎస్‌వీ ప్రసాద్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రసాద్ గతంలో ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్‌లో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ, అమరావతిలోని ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారటీ(ఏపీరెరా)లో డిప్యూటేషన్‌పై పనిచేశారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల మేరకు జీవీఎంసీ సీసీపీగా బాధ్యతలు చేపట్టారు.
ఇదా కూటమి ధర్మం
డాబాగార్డెన్స్: కూటమి ధర్మానికి టీడీపీ తూట్లు పొడిచిందని 39వ వార్డు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి దామోదర్ యాదవ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ టీడీపీ దక్షిణ ఇన్‌చార్జి వల్లే తాను ఓడిపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. కూటమిలో ఉంటూ పొత్తు ధర్మం పాటించలేని ఇన్‌చార్జిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే టీడీపీ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. రెబల్ అభ్యర్థులను కూటమిలోకి తీసుకుంటే ఊరుకోబోనన్నారు. బీజేపీ అభ్యర్థులకు ఎన్నికల్లో టీడీపీ నాయకులు చుక్కలు చూపించారని మండిపడ్డారు.
పథకాలపై సమీక్షిస్తున్న వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కమిటీ అధికారులు
మహారాణిపేట: హెల్త్ ఇండికేటర్లపై వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కమిటీ బుధవారం సమీక్ష నిర్వహించారు. కమిటీ రాష్ట్ర చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ డి.ప్రకాష్‌రావు, స్టేట్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎల్‌బీఎస్‌హెచ్ దేవి తదితరులు జిల్లాలో అమలవుతున్న పలు పథకాలపై సమీక్షించారు. జాతీయ హెల్త్ మిషన్ నిధులు ఏ విధంగా వినియోగిస్తున్నారన్న దానిపై ఆరా తీశారు. అనంతరం భానోజీనగర్, గాజువాక తదితర పీహెచ్‌సీల్లో పర్యటించి.. పథకాల అమలు తీరుతెన్నులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, డాక్టర్ డి.ప్రకాష్‌రావు, డా.ఎల్.బి.ఎస్.హెచ్.దేవి, అధికారులు ఎ.వాసుబాబులను సన్మానించారు. వివిధ విభాగాల అధికారులు డాక్టర్ బి.ఉమావతి, శశిభూషణ్, బి.రమేష్ పాల్గొన్నారు.


