ఎన్నికలకు పటిష్ట పోలీస్‌ బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పటిష్ట పోలీస్‌ బందోబస్తు

Nov 5 2026 12:28 AM | Updated on Nov 5 2026 12:28 AM

కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా

ద్వారకా నగర్‌: విశాఖ రూరల్‌ పరిధిలోని నాలుగు మండలాల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు నగర పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల విధుల కోసం 953 మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించారు. బుధవారం పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూములను పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బందోబస్తులో భాగంగా 25 రూట్‌ మొబైల్స్‌, 15 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు, నాలుగు స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు, 10 మొబైల్‌ పార్టీలు, నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, నాలుగు చెక్‌పోస్టులు, రెండు పికెట్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్‌ సామగ్రి పంపిణీ నుంచి బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూంలకు చేరే వరకు నిరంతర భద్రత కల్పించాలని సీపీ ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టినా, బెదిరించినా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రశాంత నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement