విశాఖ స్పోర్ట్స్: జాతీయ పాఠశాలల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తమిళనాడు జట్లు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. విశాఖలో జరుగుతున్న పోటీల్లో సోమవారం ఆరో రౌండ్ ముగిసే సమయానికి అండర్–18 విభాగంలో వేలమ్మల్ నెక్సస్–2, వేలమ్మల్ ఎంహెచ్‌ఎస్ జట్లు చెరో 11 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కల్వి పబ్లిక్ స్కూల్ 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.అండర్–12 విభాగంలో వేలమ్మల్ నెక్సస్–2 జట్టు ఆరు రౌండ్లలోనూ విజయం సాధించి 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కన్నూర్ విద్యానికేతన్, వేలమ్మల్ నెక్సస్–1 జట్లు చెరో 9 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏపీకి చెందిన అక్షర, భాష్యం పాఠశాల జట్లు కూడా పోటీలో కొనసాగుతున్నాయి.


