బేయాన్‌ కారు ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

బేయాన్‌ కారు ఆవిష్కరణ

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

ఎంవీపీ కాలనీ: ఎంవీపీ కాలనీలోని సాయి స్వర్ణ హుండై షోరూంలో సోమవారం న్యూ బేయాన్‌ కారును ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సాయి స్వర్ణ హుండై మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమన్‌, సినీ రచయిత సత్యానంద్‌, సాయి కృష్ణ ట్రావెల్స్‌ అధినేత రామచంద్రరావు, సాయి స్వర్ణ హుండై సీఈవో అబ్బాస్‌ ఖాన్‌ ముఖ్య అతిథులుగా హాజరై నూతన మోడల్‌ కారును ఆవిష్కరించారు. ఈ కారు ఎక్స్‌–షోరూం ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. అధునాతన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందించిన ఈ కారు వినియోగదారులకు మెరుగైన డ్రైవింగ్‌ అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రవిరాజా ట్రావెల్స్‌ అధినేత రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement