ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

అల్లిపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని మాజీ అదనపు ప్రభుత్వ న్యాయవాది బలగ సత్యారావు ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రాలు అధికార పార్టీ ఆధిపత్య ప్రదర్శనకు వేదికలుగా మారాయని విమర్శించారు. కూటమి పార్టీ ఏజెంట్లను మాత్రమే అనుమతించి, ఇతర పార్టీల ఏజెంట్లను అడ్డుకోవడం సరికాదన్నారు. ఓటర్లపై దాడులు, రిగ్గింగ్‌ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.పోలీసులు, ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్‌ కల్పించిన ఓటు హక్కు ను బలప్రయోగంతో అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement