మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకోండి

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

మహారాణిపేట: సముద్ర మత్స్యకారుల ప్రాణరక్షణ, జీవనోపాధి భద్రతకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఈస్ట్‌ కోస్ట్‌ మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ మంత్రికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1.65 లక్షల మైరెన్‌ ఫిషింగ్‌ కుటుంబాలు, 555 మత్స్యకార గ్రామాలు, 349 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. సముద్రంలో బోట్లు మునిగిపోవడం, ఇంజన్లు పనిచేయకపోవడం, అగ్ని ప్రమాదాలు, తుపాన్ల సమయంలో మత్స్యకారులు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం మేజర్‌ ఫిషింగ్‌ హార్బర్‌తో పాటు నిజాంపట్నం, మచిలీపట్నం, జువ్వలదిన్నె మైనర్‌ హార్బర్లలో మైరెన్‌ అంబులెన్సులు, హైస్పీడ్‌ రెస్క్యూ బోట్లు, అత్యవసర వైద్య పరికరాలు, ఆక్సిజన్‌, జీపీఎస్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరారు. తుపాన్లు, వేట నిషేధిత సమయాల్లో మత్స్యకారులకు నేరుగా డీబీటీ ద్వారా ఆర్థిక సాయం అందించే ప్రత్యేక పరిహార ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. బోట్లు మునిగిపోవడం, తుపాను, అగ్ని ప్రమాదాలు, ఇంజన్లు, యంత్ర పరికరాల నష్టాలకు బీమా రక్షణ కల్పించాలన్నారు. డీజిల్‌ సబ్సిడీ పెంచి మత్స్యకారులకు ఉపశమనం కల్పించాలని కోరారు. ఈ నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్ర మంత్రి వ్యక్తిగతంగా స్పందించి, అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement