ఆనందపురం: మండలంలోని శొంఠ్యాం పంచాయతీ గుమ్మడివానిపాలెం రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి గోవుల అక్రమ రవాణా ఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడివానిపాలెం వద్ద ఆగి ఉన్న ఓ వ్యాన్ నుంచి మూగజీవాల అరుపులు వినిపించడంతో అనుమానం వచ్చిన యువకులు వాహనాన్ని పరిశీలించారు. వ్యాన్‌లో గోవుల కాళ్లను తాళ్లతో కట్టి, ఒకదానిపై ఒకటి కిక్కిరిసేలా తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాన్ని అడ్డుకున్నారు.డ్రైవర్, క్లీనర్‌ను రవాణా పత్రాలు చూపాలని కోరగా వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పాటు సరైన సమాధానం కూడా ఇవ్వలేకపోయారని తెలిపారు. దీంతో సమరస సేవ ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ కోరుకొండ రామలక్ష్మికి సమాచారం అందించారు.ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు డయల్–100, 112 నంబర్లకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ లైన్లు బిజీగా ఉండటంతో ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఈలోగా అక్రమ రవాణాదారులు మరో వ్యాన్‌ను అక్కడికి రప్పించి, గోవులను దానిలోకి మార్చి పెందుర్తి మార్గం గుండా పరారైనట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటనపై విచారణ జరిపి గోవుల అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.


