లంచం ఇవ్వలేదని రెవెన్యూ సిబ్బంది దాడి! | - | Sakshi
Sakshi News home page

లంచం ఇవ్వలేదని రెవెన్యూ సిబ్బంది దాడి!

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

కలెక్టర్‌కు మహిళ ఫిర్యాదు

మహారాణిపేట: లంచం ఇవ్వలేదనే కారణంతో రెవెన్యూ సిబ్బంది తనపై భౌతిక దాడికి పాల్పడి, కాంపౌండ్‌ వాల్‌ను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ గాజువాక మండలం భానోజీతోటకు చెందిన జాలుమూరు శ్రీలక్ష్మి సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భానోజీతోట సర్వే నంబర్‌ 86లో భూ ఆక్రమణదారులతో రెవెన్యూ సిబ్బంది కుమ్మకై ్క ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సహకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. గత 15 ఏళ్లుగా భానోజీతోటలో భూమి క్రమబద్ధీకరణ పట్టాపై నివాసం ఉంటున్నానని తెలిపారు. సర్వే నంబర్‌ 86లో జరుగుతున్న ఆక్రమణలపై తన భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. దీంతో కక్ష పెంచుకున్న గాజువాక మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మధుల, వీఆర్వో వనజ లంచం డిమాండ్‌ చేశారని ఆరోపించారు. లంచం ఇవ్వకపోవడంతో అక్టోబర్‌ 30న తన ఇంటికి వచ్చి జుట్టు పట్టుకుని దాడి చేశారని, కాంపౌండ్‌ వాల్‌ను కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దాడికి పాల్పడిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement