తాటిచెట్లపాలెం: జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ఆ పార్టీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పోలింగ్ అనంతరం నగర ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లకు ఆటంకాలు ఎదురయ్యాయని, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కూటమి పాలనపై ప్రజలు విసిగిపోయారని, ప్రచార సమయంలో తమకు మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. ఫలితాల్లో తాను మేయర్‌గా, మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో విశాఖను అభివృద్ధి చేస్తామని తెలిపారు.


