కౌంటింగ్‌ వరకు లీగల్‌ సెల్‌ ప్రతినిధులు అందుబాటులో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ వరకు లీగల్‌ సెల్‌ ప్రతినిధులు అందుబాటులో ఉండాలి

Nov 2 2026 1:35 AM | Updated on Nov 2 2026 1:35 AM

అల్లిపురం: జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన లీగల్‌ సెల్‌ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు బాజీ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ అభ్యర్థులకు సహకరించిన రాష్ట్ర కమిటీ నాయకులు, లీగల్‌ సెల్‌ సభ్యుల సేవలను ఆయన అభినందించారు. నవంబర్‌ 3న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలోనూ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండి, ఫలితాలు వెలువడే వరకు సమన్వయంతో బాధ్యతలు నిర్వహించాలని కోరారు. విశాఖ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి విజయం సాధిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన బాజీ నాయుడు, ఆమెకు మెజార్టీ లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో లీగల్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం కృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఊదా శ్రీనివాస్‌, ఈస్ట్‌ నియోజకవర్గ జిల్లా ప్రధాన కార్యదర్శి మొల్లి రామారావు, జిల్లా కార్యదర్శి తులసీదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement