ఓటు హక్కు ప్రజల ఆయుధం | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు ప్రజల ఆయుధం

Nov 2 2026 1:35 AM | Updated on Nov 2 2026 1:35 AM

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

అక్కిరెడ్డిపాలెం: మింది హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి చేతిలో ఉన్న ఆయుధమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. ఓటు వేసేందుకు వచ్చే వారిని కూటమి అడ్డుకోవడం దారుణమని, వైఎస్సార్‌సీపీ వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభద్రతాభావంతో వ్యవహరిస్తోందని, ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజలు తీసుకునే ప్రతి నిర్ణయానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచి పోరాడుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement