నేషనల్‌ స్కూల్స్‌ చెస్‌లో వేలమ్మల్‌ నెక్సస్‌ జోరు | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ స్కూల్స్‌ చెస్‌లో వేలమ్మల్‌ నెక్సస్‌ జోరు

Nov 2 2026 1:35 AM | Updated on Nov 2 2026 1:35 AM

విశాఖ స్పోర్ట్స్‌: నేషనల్‌ స్కూల్స్‌ టీమ్‌ చాంపియన్‌షిప్స్‌లో అండర్‌–12, అండర్‌–18 విభాగాల్లో వేలమ్మల్‌ నెక్సస్‌ జట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. విశాఖ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఈ టోర్నీలో అండర్‌–12లో 27 జట్లు, అండర్‌–18లో 23 జట్లు పాల్గొంటున్నాయి.తొలిరోజు స్విస్‌ లీగ్‌ పద్ధతిలో మూడు రౌండ్లు నిర్వహించగా, రెండు విభాగాల్లోనూ వేలమ్మల్‌ నెక్సస్‌ జట్లు పరాజయం లేకుండా నాలుగో రౌండ్‌కు చేరాయి. అండర్‌–12లో 1847 సగటు రేటింగ్‌తో, అండర్‌–18లో ఫిడే మాస్టర్‌ మహిష్‌ (2131 రేటింగ్‌) నాయకత్వంలో జట్లు ముందంజలో ఉన్నాయి.

అండర్‌–12లో లిశాంత్‌, పూజశ్రీ, సర్వేస్‌, ఆధ్య, అండర్‌–18లో కిషోర్‌, హకీష్‌, గోకుల్‌, కెవిన్‌ విజయాలు సాధించి జట్లకు సహకరించారు. ఈ పోటీలను ఆంధ్ర చెస్‌ సంఘం, ఆల్‌ విశాఖ చెస్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. టోర్నీని ఆదివారం ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. యువ క్రీడాకారులు కష్టపడి సాధన చేసి భవిష్యత్తులో గ్రాండ్‌మాస్టర్లుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement