విశాఖ స్పోర్ట్స్: సబ్ జూనియర్ అండర్–13 బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నీలో విశాఖ చిన్నారులు సత్తాచాటారు. బాలికలు, బాలుర డబుల్స్ విభాగాల్లో ఫైనల్‌కు చేరిన ప్రవ్య–ప్రియాంక, మోజేష్–మోక్షజ్ఞ జోడీలు రన్నరప్‌గా నిలిచాయి. ముంబైలో ఆదివారంతో ముగిసిన ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ రెండు జోడీలు టైటిల్ పోరులో చివరి వరకు పోరాడి తృటిలో విజయాన్ని చేజార్చుకున్నాయి. బాలికల డబుల్స్ ఫైనల్లో పి.ప్రవ్య, సీహెచ్ ప్రియాంక జోడీ అమైర్ దుమట్కర్–సైన శర్మ జోడీతో తలపడింది. హోరాహోరీగా సాగిన పోరులో 12–15, 15–9, 15–17 స్కోరుతో 1–2 తేడాతో ఓటమి పాలైంది. తొలి గేమ్ కోల్పోయినప్పటికీ రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థికి దీటుగా నిలిచింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. బాలుర డబుల్స్ ఫైనల్లో విశాఖకు చెందిన కె.మోజేష్–కె. మోక్షజ్ఞ జోడీ లోకేష్ గుర్జర్–రక్షిత్ సింగ్ జోడీతో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో 14–16, 12–15 స్కోరుతో వరుస గేముల్లో ఓటమి చెందింది. తొలి గేమ్‌లో విజయానికి చేరువైనప్పటికీ చివరి దశలో పాయింట్లు కోల్పోయి 14–16తో గేమ్‌ను చేజార్చుకుంది. దీంతో రెండు విభాగాల్లోనూ విశాఖ జోడీలు రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నాయి.


