రేపే పోలింగ్.. 3న ఓట్ల లెక్కింపు
మేయర్ బరిలో 15 మంది..
కార్పొరేటర్లుగా 573 మంది పోటీ
120 వార్డులు.. 18.37 లక్షల మంది ఓటర్లు
1,990 పోలింగ్ కేంద్రాలు.. ఎన్నికల విధుల్లో 14,334 మంది సిబ్బంది
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. మైకుల హోరు.. బహిరంగ సభలు.. రోడ్‌షోలు.. ఇంటింటి ప్రచారంతో హోరెత్తిన నగరం ఇక పోలింగ్‌కు సిద్ధమైంది. సవరించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1న పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. శుక్రవారం సాయంత్రం ప్రచార గడువు ముగియడంతో సైలెంట్ పీరియడ్ ప్రారంభమైంది.
మేయర్ పీఠం కోసం 15 మంది పోరు
గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వైఎస్సార్‌సీపీ నుంచి వరుదు కల్యాణి, కాంగ్రెస్ నుంచి దేవర నాగసునందాదేవి, టీడీపీ నుంచి ముక్కా శ్రావణి, బీఎస్పీ నుంచి కరణం కీర్తన గ్రేస్, భారత చైతన్య యువజన పార్టీ నుంచి నమ్మి భవాని పోటీలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో నిలిచారు.
120 వార్డులు..
573 మంది అభ్యర్థులు
జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు 573 మంది కార్పొరేటర్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీతో ఎన్నికల బరిలో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి.
పార్టీల వారీగా
అభ్యర్థుల వివరాలు..
వైఎస్సార్‌సీపీ – 119, టీడీపీ – 77, జనసేన – 32, బీజేపీ – 11, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆప్, బీఎస్పీ, ఇతర పార్టీలు – 88, స్వతంత్రులు – 246
18.37 లక్షల మంది ఓటర్లు
గ్రేటర్ ఎన్నికల్లో 18,37,901 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 1,990 పోలింగ్ కేంద్రాలు, 4,378 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. ఎన్నికల విధుల నిర్వహణకు 14,334 మంది పోలింగ్ సిబ్బందితో పాటు 82 మంది ఆర్వోలు, ఏఆర్వోలు, 56 మంది మాస్టర్ ట్రైనర్లు, 95 మంది నోడల్ అధికారులు, సహాయక అధికారులు, 201 మంది రూట్ అధికారులు, 61 మంది సెక్టార్ అధికారులు, 10 మంది జోనల్ స్పెషల్ అధికారులు, ఇతర అధికారులను నియమించారు.
రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్
నవంబర్ 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
వార్డులు పోటీలో ఉన్న పోలింగ్
అభ్యర్థులు కేంద్రాలు
భీమిలి: 1–5 19 78
మధురవాడ: 6–11, 120 27 162
తూర్పు: 12–29 70 309
దక్షిణ: 30–45 77 249
ఉత్తర: 46–65 86 302
పశ్చిమ: 66–82 72 245
గాజువాక: 83–101 139 329
అగనంపూడి: 102–106 28 75
అనకాపల్లి: 107–112 20 89
పెందుర్తి: 113–119 35 152


