డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థులకు బీసీ కుల సంఘాలు, కులవృత్తిదారులు మద్దతుగా నిలిచారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ బహుజన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సదస్సులో కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు మేయర్గా బరిలో నిలిచిన వరుదు కల్యాణికి మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ బహుజన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిన్నింటి ఆదిమూర్తియాదవ్, వెంపటాపు నూకరాజు, కోడూరి సత్యనారాయణ, పిల్లా సుజాత పాల్గొన్నారు.


