స్వతంత్ర నాయకురాలా? కీలుబొమ్మ మేయరా? | - | Sakshi
Sakshi News home page

స్వతంత్ర నాయకురాలా? కీలుబొమ్మ మేయరా?

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

మహా విశాఖ నగరాన్ని నడిపించే ప్రథమ పౌరురాలు ఎలా ఉండాలి? స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ధీరత్వంతో ఉండాలా.. లేక ఇతరుల చేతుల్లో కీలుబొమ్మగా మిగిలిపోవాలా? జీవీఎంసీ ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరణ వేదికలపై దృశ్యాలే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇస్తున్నాయి. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థుల తీరుతెన్నులను ప్రతిబింబిస్తున్న రెండు ఫోటోలు ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. టీడీపీ మేయర్‌ అభ్యర్థి ముక్కా శ్రావణి పరిస్థితి చూస్తే రేపు ఆమె గెలిచినా పెత్తనమంతా పక్కన ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలదేనని తేటతెల్లమవుతోంది. వేదికపై అగ్రనేతల ఆధిపత్యం మధ్య ఆమె ఒక సాధారణ కార్యకర్తలా మూలన నిలబడాల్సి వచ్చింది. రేపు అధికారంలోకి వస్తే ఆమెకు ఎలాంటి స్వేచ్ఛ ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పూర్తి భిన్నంగా వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి తన నాయకత్వ పటిమను చాటుకున్నారు. వేదికపై ఉద్ధండులైన మాజీ మంత్రులు ఉన్నప్పటికీ... ఏమాత్రం బెరుకు లేకుండా ప్రధాన స్థానంలో కూర్చొని సగర్వంగా సమావేశాన్ని నడిపించారు. నాయకురాలికి ఉండాల్సిన దర్పాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కళ్లకు కట్టారు. ఒకవైపు ఆధిపత్యంతో ఉక్కిరిబిక్కిరి చేసే సంస్కృతి.. మరోవైపు స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసంతో నడిపించే నాయకత్వం. ఈ రెండు చిత్రాలు రేపటి విశాఖ భవిష్యత్తుకు ప్రత్యక్ష నిదర్శనాలు. నగర ప్రగతిని నడిపించే అసలైన నాయకురాలు ఎవరో విశాఖ ఓటర్లే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

– సాక్షి, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement