సాక్షి విలేకరిపై దాడికి నిరసన | - | Sakshi
Sakshi News home page

సాక్షి విలేకరిపై దాడికి నిరసన

Oct 31 2026 8:13 AM | Updated on Oct 31 2026 8:13 AM

బీచ్‌రోడ్డు : కర్నూలు జిల్లా ఆత్మకూరు సాక్షి రూరల్‌ విలేకరి సుబ్బారెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ విశాఖలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి, క్యాండిల్స్‌, ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాక్షి బ్యూరో చీఫ్‌ కే. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా విశాఖలో కూడా విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసినట్లేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి కేటీ రామునాయుడు, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ నాయకులు బసనబోయిన ఆనందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో నగరంలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

దాడిపై ఖండన

విశాఖ విద్య: సాక్షి ఆత్మకూరు రూరల్‌ రిపోర్టర్‌ సుబ్బారెడ్డిపై జరిగిన దాడిని వైఎస్సార్‌ సీపీ ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జీలకర్ర నాగేంద్ర ,ఏయూ నిరుద్యోగ సంఘం నేత డా. సురేష్‌ మీనన్‌ ,విదసం కన్వీనర్‌ డా. బూసి వెంకటరావు ఖండించారు.

ఏపీయూడబ్ల్యూజే..

మహారాణిపేట: సాక్షి రిపోర్టర్‌పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల జిల్లా కమిటీ అధ్యక్షుడు కె. రాము, ప్రధాన కార్యదర్శి కె.చంద్రమోహన్‌, కోశాధికారి పరుశురాం,ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్‌. రామచంద్రరావు డిమాండ్‌చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement