మహారాణిపేట: వైఎస్సార్సీపీ బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి అన్నారు. బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గత సాధారణ ఎన్నికల్లో బ్రాహ్మణులను గుర్తించిన వైఎస్సార్సీపీ ఎంతో మందికి టికెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బ్రాహ్మణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు పీవీ నారాయణ మాట్లాడుతూ జీవీఎంసీలో అధికారం చేపట్టిన తర్వాత పలు నామినేటెడ్ పోస్టుల భర్తీలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విశాఖ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కావూరు చరణ్‌కుమార్ మాట్లాడుతూ బ్రాహ్మణులను గుర్తించి పదవులు ఇవ్వాలని కోరారు. అనంతరం మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణిని సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్, వివిధ బ్రాహ్మణ సంఘాల నాయకులు జి.ప్రభాకరశాస్త్రి, నండూరి సుబ్రహ్మణ్యం, కోదూరి సుశీల, కె.రామభద్రుడు, శివ గణేష్ శర్మ, తెన్నేటి సునీల్ శర్మ, అయిలూరి నీలకంఠ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
జీవీఎంసీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి


