బీచ్‌రోడ్డు: హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త ఐయూవీ హ్యుందాయ్ బేయాన్‌ను విశాఖలో లక్ష్మీ హ్యుందాయ్ ఆధ్వర్యంలో ఘనంగా లాంచ్ చేసింది. ‘ఇంటెలిజెన్స్ దట్ మూవ్స్’ ఫిలాసఫీతో రూపొందించిన ఈ వాహనం దేశవ్యాప్తంగా విడుదలైన సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ హ్యుందాయ్ సేల్స్ హెడ్ సోమనాథ్ లాల్ మాట్లాడుతూ.. బేయాన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. హెచ్ఎక్స్–2 నుంచి హెచ్ఎక్స్–10 వరకు ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉందన్నారు. రూ.11 వేలతో బుకింగ్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. పది ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్, జెనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్–2 ఏడీఏఎస్, ఆరు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో లక్ష్మీ హ్యుందాయ్ ఆపరేషన్స్ హెడ్ శ్రీనివాసన్, సిబ్బంది, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. బుకింగ్, టెస్ట్ డ్రైవ్ కోసం 7997999456 నంబరును సంప్రదించాలని తెలిపారు.


