సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కమిటీ కన్వీనర్లు, సభ్యులకు ఎన్నికల బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితా లోపాలు, పార్టీ కార్యకర్తలపై నమోదవుతున్న కేసు లు, ఎన్నికల సమయంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమన్వయంతో పనిచేయాలని సభ్యులకు సూచించారు. పసుపులేటి బాలరాజు, తైనాల విజయకుమార్, తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తి రెడ్డి, కోలా గురువులు, యల్లపు రఘురాం,ఐహెచ్ ఫారూఖీ, సతీష్వర్మ, కొండా రాజీవ్, జాన్వెస్లీ, పీలా వెంకట లక్ష్మి, పి.వి నారాయణ, బొల్లవరపు జాన్వెస్లీ, కిరణ్ రాజు, పేర్ల విజయ చందర్, గండ్రాజు వెంకట రవిరాజు, అంబటి శైలేష్, ద్రోణంరాజు శ్రీవాస్తవ, అల్లంపల్లి రాజాబాబు, మంత్రి రాజశేఖర్, గుంటూరు నరసింహమూర్తి, నీలి రవి, గరికిన గౌరి, శీలం లక్ష్మణ్, బాజీ నాయుడు, కాళిదాస్రెడ్డి, మహంతి పాల్గొన్నారు.


