విశాఖ స్పోర్ట్స్: తొలి షార్ట్ కోర్స్ సీనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో విశాఖకు చెందిన వి.నాగగ్రీష్మిణి పతకాల పంట పండించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన ఆమె ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సాధించింది. 100 మీటర్ల ఇండివిడ్యువల్ మెడ్లీని 1.07.20 నిమిషాల్లో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకుంది. 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ను 1.23 నిమిషాల్లో పూర్తి చేసి కాంస్య పతకాన్ని, 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ను 33.66 సెకన్లలో ముగించి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్వాటిక్ కాంప్లెక్స్‌లో అక్టోబర్ 25 నుంచి 28 వరకు ఈ పోటీలు జరిగాయి. గ్రీష్మిణి సాధించిన విజయాలు విశాఖతో పాటు రాష్ట్రానికి గర్వకారణమని జిల్లా అక్వాటిక్ సంఘం కార్యదర్శి వెంకట్‌రామ్ తెలిపారు.


