మంత్రి లోకేష్‌, ఎంపీ భరత్‌ విశాఖను తినేస్తారు | - | Sakshi
Sakshi News home page

మంత్రి లోకేష్‌, ఎంపీ భరత్‌ విశాఖను తినేస్తారు

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

జీవీఎంసీ ఎన్నికల్లో

వైఎస్సార్‌సీపీని

గెలిపించాలి

తెలుగుశక్తి అధినేత

బీవీ రామ్‌

తగరపువలస: టీడీపీ జీవీఎంసీ మేయర్‌ అభ్యర్థిగా ముక్కా శ్రావణిని బరిలోకి దించి విశాఖను తినేయడానికి ఎంపీ భరత్‌, మంత్రి లోకేశ్‌ పావులు కదుపుతున్నారని తెలుగుశక్తి అధినేత బీవీ రామ్‌ ఆరోపించారు. గురువారం సంతపేట రెండో వార్డులోని వైఎస్సార్‌సీపీ ఎన్నికల కార్యాలయంలో కార్పొరేటర్‌ అభ్యర్థి అక్కరమాని రామునాయుడుకు మద్దతుగా ఆయన మాట్లాడారు. రామునాయుడు మూడుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి కార్పొరేటర్‌గా, రెండుసార్లు పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా ఓటమి ఎరుగకుండా పనిచేశారని, అలాంటి నిజాయతీపరుడిని గెలిపించాలని కోరారు. మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణికి ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకున్నప్పటికీ, ఎంపీ భరత్‌ దొడ్డిదారిన మేయర్‌ను పదవి నుంచి దించి, తమకు అనుకూలమైన వారిని ఆ పీఠంపై కూర్చోబెట్టి రూ.5 వేల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. డేటా సెంటర్‌ పేరుతో అటవీ భూములను ఆక్రమించారని, ప్రజలకు తాగునీరు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. చంద్రబాబు పేరుకే ముఖ్యమంత్రిగా ఉన్నారని, పాలనలో ఆయన ప్రభావం తగ్గిందని ఎద్దేవా చేశారు. జీవీఎంసీ ఎన్నికలు ఎంపీ భరత్‌ అహంభావానికి, విశాఖ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి టీడీపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ హోమియో వైద్యుడు పప్పుర్‌ నిఖుంజ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు చిల్ల భాస్కరరెడ్డి, జీరు వెంకటరెడ్డి, బింగి హరికిరణ్‌రెడ్డి, డబ్బీరు ప్రశాంతి, చిప్పాడ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement