మురళీనగర్: వెలమ ఆడపడుచుగా మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు. మురళీనగర్–మాధవదార వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాశల సూర్యనారాయణ ఆధ్వర్యంలో మురళీనగర్ ఆహ్వానం ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి, 59వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అల్లు వెంకట సత్యశ్రీకి మద్దతుగా వెలమల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుదు కల్యాణి సేవా భావంతో పోటీ చేస్తున్నారని చెప్పారు. విశాఖను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వరుదు కల్యాణి మాట్లాడుతూ తనను గెలిపిస్తే వెలమల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. మేయర్‌గా వరుదు కల్యాణి, కార్పొరేటర్‌గా అల్లు వెంకట సత్యశ్రీని గెలుపించుకుందామని మురళీనగర్–మాధవధార వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పాశల సూర్యనారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అల్లు శంకరావు, బొబ్బిలి నియోజకవర్గం పరిశీలకుడు రొంగలి జగన్నాథం, వెలమ సంక్షేమ సంఘం కార్యదర్శి వెన్నెల సూర్యనారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.


