హార్బర్‌ను సందర్శించిన కోస్టల్‌ సెక్యూరిటీ ఐజీ | - | Sakshi
Sakshi News home page

హార్బర్‌ను సందర్శించిన కోస్టల్‌ సెక్యూరిటీ ఐజీ

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

మహారాణిపేట: అర్నబ్‌ తుపాను ప్రభావంతో బలమైన గాలులకు ఫిషింగ్‌ హార్బర్‌లోని జీరో జెట్టీ వద్ద పడవలు నీట మునిగిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ కోస్టల్‌ సెక్యూరిటీ విభాగం ఐజీ గోపీనాథ్‌ జెట్టి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. తుపాను హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, పడవలు, వాటికి సంబంధించిన పరికరాలను సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు, వాతావరణ హెచ్చరికలను పాటించాలని మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో ఏపీ కోస్టల్‌ సెక్యూరిటీ ఏఎస్పీ కె.వి.రమణ, విశాఖపట్నం కోస్టల్‌ సెక్యూరిటీ డీఎస్పీ ఎస్‌.కిరణ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రమేష్‌, మత్స్యశాఖ సిబ్బంది, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement